నేరుగా శ్రీవారి దర్శనం..! 23 h ago
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చని దేవస్థానం అధికారులు తెలిపారు. మంగళవారం శ్రీవారిని 62,566 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 16,021 మంది భక్తులు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.2 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.